Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావును లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా హైద్రాబాద్‌లోని ఉప్పల్‌లో దుకాణంలో ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును యాదగిరిగుట్టకు ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు.
ఆయనకు చెందిన పలు ఆస్తులు, అలాగే బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇదివరకే రామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయని, పలుమార్లు కేసులు నమోదు అయ్యాయని సమాచారం. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టులో కొందరిని మోసం చేశారన్న సివిల్ కేసు కూడా నడుస్తోంది. వందల ఎకరాల భూములను బంధుమిత్రుల పేర్లపై సమకూర్చారనే ఆరోపణలు కూడా యాదగిరిగుట్ట స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
MOST READ :
-
Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!
-
Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!









