Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Nalgonda : గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలోనే.. నల్గొండ పోలీసుల ప్రత్యేకం..!

Nalgonda : గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలోనే.. నల్గొండ పోలీసుల ప్రత్యేకం..!

నల్లగొండ, మనసాక్షి.

నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా మిషన్ పరివర్తన్ లో బాగంగా జిల్లా యస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో నల్గగొండ సబ్ డివిజన్ పరిదిలో గల నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

దాదాపు 80 మంది గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో గంజాయి సేవిస్తే ఆరోగ్యం పై పడే ప్రభావం, దాని వల్లనే కలిగే దుష్పరిణామాల, నష్టాల గురించి డాక్టర్ సైకియాట్రిస్ట్ అనిల్ చే జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో అడిషనల్ యస్పీ మాట్లాడుతూ జిల్లా యస్పీ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ లో బాగంగా డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా ను ఏర్పాటు చేయుటకు ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూన్నమని, గాంజా విక్రయించిన, సేవించిన, అక్రమ రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ గంజాయి యుక్తవయస్సులో సేవించి దానికి అలవాటు పడి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. యువత మాదక ద్రవ్యాల అలవాటు పడకుండా తల్లితండ్రుల పై బాధ్యత ఉందని అన్నారు.ఒక్క సారి గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడితే ఆర్దికంగా,ఆరోగ్యం పై అనేక రకాలుగా ప్రభావం పడుతుందని అన్నారు.

ఎవరైనా డ్రగ్స్, గంజాయి విక్రయించిన, రవాణా చేసిన, సేవించినట్లు తెలిస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ నంబర్ 8712670266 సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి నార్కట్ పల్లి సిఐ నాగరాజు, ఆర్ ఐ సంతోష్,యస్.ఐ లు నాగరాజు, ధర్మా,క్రాంతి కుమార్, విష్ణు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

CEIR : ఫోన్ పోయినా దొరికే టెక్నాలజీ.. సీఈఐఆర్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!

NALGONDA : నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు రోడ్డు రోలర్ తో తొక్కిస్తూ ధ్వంసం..!

TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,

మరిన్ని వార్తలు