108 vehicle : 108 వాహనంలో మహిళ ప్రసవం

108 వాహనంలో మహిళ ప్రసవం

సూర్యాపేట, మనసాక్షి

108 వాహనంలో మహిళ ప్రసవించిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108కు సమాచారం అందించారు.

 

వెంటనే 108 వాహనం ఆ గ్రామానికి చేరుకొని ఆ మహిళను సూర్యాపేటకు తీసుకొస్తుండగా నెమ్మి కల్ సమీపంలో పాపకు జన్మనిచ్చింది. వెంటనే 108 సిబ్బంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు.

 

ప్రసవం చేసిన 108 సిబ్బంది ఈఎంటి బానోతు రమేష్,పైలట్ బంటు నాగేశ్వరరావులను బంధువులు అభినందించారు.