దుబ్బాక : అమ్మకానికి పసికందు, రూ. 20 వేలకు బేరం

దుబ్బాక : అమ్మకానికి పసికందు, రూ. 20 వేలకు బేరం
దుబ్బాక, మనసాక్షి :
దుబ్బాక నియోజకవర్గంలోని మోతే గ్రామానికి చెందిన మంజుల నిన్నటి రోజు సోమవారం సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రసవం చెంది ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన మరుసటి రోజే అమ్మకానికి పెట్టింది.

 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. . అమ్మాయి నమ్మకానికి పెట్టిన విషయంలో గజ్వేల్ చెందిన ఓ కుటుంబానికి బాలిక అమ్మకానికి సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి సమీపంలో 20 వేల ఒప్పందంతో బాలిక అమ్మకానికి సిద్ధమైయ్యారు.

 

.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని జిల్లా బాలికల సంరక్షణ అధికారి కార్యాలయం సమాచారం అందించడంతో బాల సంరక్షిత సిబ్బంది బాలికను వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.