రేపు ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు ఇలా..!
రేపు ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు
బీఆర్ఎస్ బహిరంగ సభ వల్ల ట్రాఫిక్ మళ్లింపు ఇలా
వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
ఖమ్మం ప్రతినిధి, మనసాక్షి :
ఈనెల 18వ తారీకు ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ నిమిత్తం ట్రాఫిక్ వారి ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు సూచించారు. మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారీ వాహనాలదారి మళ్లింపు :
భారీ వాహనాలు వెళ్లే హైవే లో.. లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు ,పల్లిపాడు సెంటర్, ములకలపల్లి ఎక్స్ రోడ్డు రామ్ లీలా ఫంక్షన్ హాల్, ఏనుకూరు నుంచి జన్నారం వైపు వెళ్లే భారీ వాహనాలను వైరా-బోనకల్ వైపు వైరా వైపు వస్తున్న భారీ వాహనాలు చింతకిని వైపు బోనకల్ రోడ్డు వైపు మళ్లనున్నాయి.
ఇల్లందు వైపు నుంచి భారీ వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్- రాపర్తినగర్ పాస్‌రోడ్డు మీదుగా హైద్, డబ్ల్యూఆర్ఎల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ఎన్టీఆర్ సర్కిల్లోని వాహనాలు, రాపర్తినగర్‌లోని వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ రోడ్డుకు మళ్లింపు. మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఏదులాపురం, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించారు.
కోదాడ ఎక్స్ రోడ్ సర్కిల్,
ఏదులాపురం ఎక్స్ రోడ్, వరంగల్ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలు, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు మళ్లించి కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే ,హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చే భారీ వాహనాలు గుర్రాలపాడు-వెంకటగిరి ఎక్స్‌రోడ్డు-కోదాడ వైపు-విజయవాడ హైవే వైపు, వెంకటగిరి ఎక్స్ రోడ్ జంక్షన్. కోదాడ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలను ఖమ్మం టౌన్లోకి అనుమతించడం లేదు.
నాయుడుపేట జంక్షన్,ఏన్కూరు కేంద్రం, బోనకల్ సెంటర్ ఖమ్మం టౌన్లో భారీ వాహనాలను అనుమతించడం లేదు.
ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు?భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు.
ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా వారి గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.









