Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి –  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి 

వినూత్న సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానం

74 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రతీ పౌరుడు భారత రాజ్యాంగ స్ఫూర్తి ని కొనసాగించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన త్యాగధనులను, భారత్ ను స్వతంత్ర్య రాజ్యంగా ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు భాస్కర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన జనవరి26వ తేదీన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18రోజుల సమయం పట్టిందని అన్నారు. మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, దీని నిర్మాణం కోసం అప్పట్లోనే రూ.64 లక్షలు ఖర్చయిందని అన్నారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదని, అనిర్వచనీయమైనదని అన్నారు. గణతంత్ర రాజ్యంలో ప్రజలే ప్రభుత్వం….

ప్రభుత్వమంటేనే ప్రజలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వినూత్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. భారత ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహించడంతోనే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు యావత్ భారత్ దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కేసీఆర్ కొనసాగించారని అన్నారు. అద్భుత ప్రగతి మార్గంలోతెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నదని అన్నారు. ఐటీ, ఔషధ, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం హబ్ గా మారిందని అన్నారు. వ్యవసాయం, విద్యుత్, పల్లె,పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిందని అన్నారు. ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా రెండున్నరేండ్లలో 43,293 మంది బాధిత రైతు కుటుంబాలకు రూ.2,164 కోట్లు చెల్లించిందని అన్నారు.

ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ప్రతీ ఏడాది రైతులకు పంట పెట్టుబడి సాయంగా వానా కాలంలో రూ.7వేల కోట్లు, యాసంగిలో రూ.7వేల కోట్లు అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం ఉన్న గోదాములను 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి ప్రభుత్వం పెంచిందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన జలాలను అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా నియోజకవర్గంలోని వేలాది ఎకరాల సాగుభూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని అపరిష్కృత సమస్యలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మగ్దూమ్ పాషా, జొన్నలగడ్డ రంగా రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉదయ్ భాస్కర్, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా మైనారిటీ నాయకులు మదార్ బాబా, ఖాదర్, బాసాని గిరి,జగదీశ్, జావిద్, లక్ష్మీ నారాయణ, పత్తిపాటి నవాబ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్,

సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, కౌన్సిలర్ ఇలియాస్, పునాటి లక్ష్మీనారాయణ, కర్నే గోవింద్ రెడ్డి, ఉబ్బపల్లి మధు, ఖాదర్, సాధినేని శ్రీనివాస్, మన్నెం లింగారెడ్డి, బల్లెం అయోధ్య, తలకోల శ్రీధర్ రెడ్డి, మెరుగు సంజయ్, కందగట్ల అశోక్, భీమ్ల నాయక్, కుప్పాల సుబ్బారావు, బారెడ్డి అశోక్ రెడ్డి, గుడిపాటి సైదులు బాబు, ఖాజా మొహినుద్దిన్, షోయబ్, ఒగ్గు జానయ్య, ముజ్జా రామకృష్ణ, ధీరావత్ వెంకటేశ్వర్లు, కుర్ర కాంతి కృష్ణకాంత్, వింజం రాజేందర్, పాక్స్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పిస్కే ప్రసాద్, రాందాస్, కోదాటి రమ, శ్రవణ్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, కామిశెట్టి శ్రీనివాస్, సేవా నాయక్, సుధాకర్, నల్లగంతుల నాగభూషణం, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు