Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం..!

మిర్యాలగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ మండల అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి

మిర్యాలగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో
నూతనంగా కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ మండల అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని గౌడ సంఘం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, గుండు నరేందర్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు అంకితభావంతో పనిచేసి పార్టీని మరింత ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందజేయాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గౌడ సంఘ సభ్యులు కాకునూరి బసవయ్య, రాములు గౌడ్, చౌగాని వెంకన్న, పోలగాని వెంకటేష్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు