Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంవ్యవసాయం

రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులుగా చింత రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం

రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులుగా చింత రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం

నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాట్లు

మిర్యాలగూడ, ( నల్గొండ ) మన సాక్షి :

నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గా నూతనంగా నియమితులైన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి రేపు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు అధికారికంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికిరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లు, వివిధ కార్పోరేషన్ ల చైర్మన్ లు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు . అదేవిధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బి ఆర్ ఎస్ కార్యకర్తలు, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు, యువకులు, మహిళలు, రైతులు భారీగా తరలి వెళ్ళనున్నారు.

మరిన్ని వార్తలు