Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
స్వామి మరణం కలచివేసింది – రేవంత్ రెడ్డి
స్వామి మరణం కలచివేసింది – రేవంత్ రెడ్డి
ములుగు , మనసాక్షి :
ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుమారస్వామి అకాలమరణం చెందారు. కాగా ఆయన మరణం కలచివేసిందని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ని సీతక్కతో కలిసి పరామర్శించారు.
క్షేత్ర స్థాయి కార్యకర్త నుండి డీసీసీ స్థాయికి ఎదిగిన స్వామి లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.









