హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు
హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు
కంగ్టి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన గిరిజన యువకుడి హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా అదనపు, సెషన్ష్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. జడ్జి రాజు మంగళవారం తీర్పు చెప్పారు. కంగ్టి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2016 నవంబర్ 16వ తేదీన కంగ్టి మండలం ఘన్‌పూర్ తండాకు చెందిన పవార్ రాజేందర్ 35 ను తడ్కల్ గ్రామానికి చెందిన నిందితులు రెడ్డి మారుతి, రెడ్డి జ్ఞానేశ్వర్, రెడ్డి రాంబాయి, రెడ్డి చంద్రపాల్, రెడ్డి లక్షణ్, రెడ్డి సాయులు, రెడ్డి రాములు, రెడ్డి పండరి హత్య చేశారు.
నిందితుల్లో రెడ్డి పండరి మృతి చెందాడు. మృతుడి భార్య పవార్ శోభాబాయి ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ తిరుపతన్న, ఎస్సై నానునాయక్ కేసు సమెదు చేశారు. కాగా పీపీ విజయ్ శంకర్ రెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు ఏడుగురిని దోషులుగా నిర్ధారించారు. వారికి జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.









