Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

వేములపల్లి : సాగర్ ఎడమ కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

వేములపల్లి : సాగర్ ఎడమ కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

వేములపల్లి , మన సాక్షి :

సాగర్ ఎడమ కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శేట్టిపాలెం గ్రామ శివారులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం…  మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన గాదె రమ్యకు ఆమె భర్త నాగరాజు మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో శేట్టిపాలెం గ్రామ శివారులోనికి సాగర్ ఎడమ కాలువలోకి రమ్య దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గమనించిన స్థానికులు రమ్యను కాపాడి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకొని పోలీసులు ఆమెను కాపాడే క్రమంలో చేతికి గాయం కాగా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి రమ్యను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు