సూర్యాపేట : మున్సిపాలిటీలో నకిలీ ట్రేడ్ లైసెన్సుల రశీదులు పట్టివేత
సూర్యాపేట : మున్సిపాలిటీ లో నకిలీ ట్రేడ్ లైసెన్సుల రశీదులు పట్టివేత
జవాన్ తొలగింపు, మీ సేవ యజమాని పాత్రపై విచారణ జరుపుతున్న పట్టణ పోలీసులు
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీలో నకిలీ ట్రేడ్ లైసెన్స్ ల దందా కొనసాగుతుంది . మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం ఆదివారం వెలుగు చూసింది…
సూర్యాపేట పట్టణంలో వ్యాపారులకు నకిలీ రశీదులు ఇఛ్చి, మున్సిపాలిటీ కమీషనర్ ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో సూత్రదారి మున్సిపాలిటీ జవాను హన్మంతు నాయక్ గా గుర్తించారు. అతనిని విధుల నుంచి తొలగించి స్ధానిక పోలీసు స్టేషను నందు కేసు నమోదు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి తెలిపారు.
నకిలీ రశీదు
ఆదివారం నాడు మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ… ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని వ్యాపారులను అడిగినప్పుడు వారు రశీదులు చూపించారని, కాని రశీదులు మున్సిపాలిటీ ఇచ్చినవి కావని గ్రహించి, నకిలీ రశీదులు ఇచ్చిన జవాను హన్మంతు నాయక్ ను పిలిచి విచారణ చేయగా, వ్యాపారస్తులకు నకిలీ రశీదులు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
గతంలో పనిచేసిన కమీషనర్ ల సంతకాలు కూడ ఫోర్జరీ చేసి పెట్టారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాంప్ లు కూడ రశీదుల మీద వున్నాయని కమీషనర్ తెలిపారు. జవానుతో పాటు పొట్టి శ్రీరాములు సెంటర్లో్ ఉన్న మీ సేవ యజమాని రాజు నాయక్ పైన కూడ పోలీసుల విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.










