Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
మేకల మందలో కొండ గొర్రె, స్వదీనం చేసుకొన్న ఫారెస్ట్ అధికారులు
కొండ గొర్రను స్వదినం చేసుకొన్న ఫారెస్ట్ అధికారులు
వాజేడు,మన సాక్షి
ములుగు జిల్లా వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామపంచాయతీ గంగారం గ్రామంలో కొండ గొర్రె లభ్యం అయింది. వివరాల్లోకి వెళితే .. పెదగంగారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మేకలు మోపడానికి అడవికి వెళ్లారు.
ఆ క్రమంలో మేకల మందలోకి వచ్చి చేరింది . ఆ కొండ గొర్రె పిల్ల అది మేకల మందలో ఇంటి వరకు వచ్చింది . దాన్ని గమనించిన మేకల కాపరి ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని ఆ కొండ గొర్రెను స్వాధీనం పరచుకొని వరంగల్ లో ఉన్నటువంటి జూ పార్కు తరలించారు.
ఈ కార్యక్రమంలో టేకులగూడెం బీట్ ఆఫీసర్ కె వికాస్, చండ్రుపట్ల బీట్ ఆఫీసర్ ఎస్ ప్రసాద్, కడెకల్ బీట్ ఆఫీసర్ కె సురేష్, బేస్ క్యాంపు అధికారులు పాల్గొన్నారు.









