లక్షేట్టిపేట్ : కాంగ్రెస్, బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్, బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో బుధవారం రోజున నూతన ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన చేయడానికి వసున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన భాగంగా లక్సీట్టిపెట్ కాంగ్రెస్ బీజేపీ నాయకులను ముందస్తు గా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేపిస్తున్న టిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్, అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు అని డిమాండ్ చేశారు. మీ అందరికీ తగిన గుణపాఠం చెప్పవలసిన రోజులు ముందు వస్తాయని, ఇక మా పోరాటం ఆగదని హెచ్చరించారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్,యూత్ అధ్యక్షుడు రాందేని వెంకటేష్,శ్రీధర్,నవాబ్,అంకతి శ్రీనివాస్, రాజు, అలాగే బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్, సీనియర్ బీజేపీ నాయకుడు శ్రీనివాస్ టౌన్ ఉపాధ్యక్షుడు సతీష్,వేముల మధు , బొప్పు సతీష్, నాయకులు పాల్గొన్నారు.










