సీఎం కేసీఆర్ కు, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి గోచార రీత్యా ..?
సీఎం కేసీఆర్ కు, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి గోచార రీత్యా ..?
నల్గొండ మనసాక్షి:
నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు… బుధవారం ఘనంగా
ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నిర్వహించారు.
శోభకృత్ నామ ఉగాది పర్వదిన సందర్భంగా.. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పంచాంగ శ్రవణం ఆసక్తికరంగా కొనసాగింది… ఈ సంవత్సరం పంచాంగ ఫలితాలలో… ధనధాన్య సమృద్ధి,ఆరోగ్య క్షేమం, సుభిక్షం కలుగుతుందని.. అటు ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఇటు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కి గోచార రీత్యా శుభం కలుగుతుందని, మంచి విజయాలు సాధిస్తారని రాజకీయ ఉన్నతి కలుగుతుందని తెలియజేశారు.
బాలు మాస్టర్ నేతృత్వంలో.. చిన్నారులతో నిర్వహించిన శాస్త్రీయ నృత్యం ఆహూతులను ఆకట్టుకున్నది
అనంతరం 50 మంది, వేద పండితులు, కవులు,రచయితలు గాయకులు, కళాకారులు, యోగా గురువులను స్వచ్ఛంద సంస్థల నిర్వావాహకులను, ఘనంగా సన్మానించి ఉగాది పురస్కారాలు అందజేశారు..
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ…
.
ఈ సంవత్సరం… ప్రజలందరు ఆయురారోగ్యాలతో… పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారని.. పంచాంగంలో తెలియ జెయటం చాలా సంతోషకరమైన విషయమని… అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో… నల్లగొండ నలు వైపులా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను… కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు , చర్చించుకోని… ప్రజలకు మంచి సందేశాన్ని పంపించాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ఈ నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి తాము శక్తి వంచన లేకుండా కృషిచేసి..ప్రజలు కోరుకున్న, మార్పును చూపిస్తామని తెలిపారు …
ఈ సందర్భంగా నల్లగొండ ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారిని ఉగాది పురస్కారంతో ఘనంగా, సన్మానించడం విశేషం….
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్,కనగల్ ఎంపీపీ ఎస్ కే కరీం పాషా, గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,నాయకులు చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్ బొర్ర సుధాకర్, బక్క పిచ్చయ్య,ఫరీదోద్దీన్, మాలే శరణ్య రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్ కాంచనపల్లి రవీందర్రావు, బకరం వెంకన్న, టీఎన్జీవో అధ్యక్షులు శ్రవణ్ కుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కార్యదర్శి సందినేని జనార్దన్ రావు కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య దేప వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు యామా కవితా దయాకర్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్ యాదవ్ ఊట్కూరు వెంకట్ రెడ్డి, రామాలయం దేవాలయ చైర్మన్ లు చకిలం వేణుగోపాలరావు, గంట్ల అనంతరెడ్డి, సూర మహేష్, పట్టణ పార్టీ కోశాధికారి గంజి రాజేందర్, నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి, AR చక్రవర్తి,తలారి యాదగిరి పొనుగోటి జనార్దన్ రావు.. బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య,
ఉగాది పురస్కారాలు పొందిన వారిలో.. కాటేపల్లి పెద్ద వెంకట నరసయ్య,పున్నమి అంజయ్య రామచంద్రారెడ్డి శీలం భద్రయ్య గజవెల్లి సత్యం కత్తుల శంకర్, డాక్టర్ కవిత కోమిశెట్టి,రమాదేవి, యోగా గురువు నాగేశ్వరరావు, రవీంద్ర చారి, నాట్య కళాకారులు సాయి సుధా తేజస్విని, తదితరులు ఉన్నారు










