రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష , అసలు ఏం జరిగింది.?
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష , అసలు ఏం జరిగింది.?
మన సాక్షి, ఇంటర్నెట్ :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ విమర్శించిన తీరు ఆయనకు చిక్కులు తెచ్చింది. నాలుగు సంవత్సరాల క్రితం ఆయనపై గుజరాత్ లో నమోదైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. కాగా ఆయనకు వెంటనే బెయిల్ మంజూరుతో పాటు తీర్పును సవాల్ చేస్తూ 30 రోజుల గడువులోగా అప్పీల్ చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. దీంతో ఆయనకు కాస్త ఊరట కలిగింది.
ఇది ఇలా ఉండగా తీర్పు వెలువడిన వెంటనే మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ సత్యమే దేవుడు.. అహింస దానిని పొందే సాధనం.. అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుడు ఎవరికైనా సరే, అనర్హత వేటపడి పదవి కోల్పోతారు. రాహుల్ గాంధీకి పదవి గండం పొంచి ఉంది. రాహుల్ గాంధీ తనకు పాడిన శిక్ష పై అప్పిల్ కు వెళ్లకపోతే ఎంపీ పదవి కోల్పోవాల్సి ఉంటుంది.
అసలు ఏం జరిగింది..?
2019 లోకసభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో ని కోలార్ లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించారు. ఈ క్రమంలో నీరవ్ మోడీ.. లలిత్ మోడీ.. పేర్లను కూడా ప్రస్తావిస్తూ మోడీ ఇంటి పేరుతో వాళ్లంతా అంటూ విమర్శలు చేశారు.
ఈ వాక్యాలపై గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే పూర్నేష్ మోడీ సూరత్ కోర్టులో కేసు వేశారు. రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. ఈ నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా సూరత్ కోర్టు గురువారం రాహుల్ గాంధీ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది.
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్👇
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
– महात्मा गांधी
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023









