Breaking NewsTOP STORIESతెలంగాణనల్గొండరాజకీయం
మూడవ సారీ ఎమ్మెల్యే గెలవాలని అభిమానుల తిరుపతి యాత్ర
మూడవ సారీ ఎమ్మెల్యే గెలవాలని అభిమానుల తిరుపతి యాత్ర
అడవిదేవులపల్లి , మన సాక్షి:
మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించాలని
అడవిదేవులపల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల చిన్న రామయ్య ఆధ్వర్యంలో అభిమానులు తిరుపతి, శ్రీశైలం, కాణిపాక యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూరాకుల గోపీనాథ్ మాట్లాడుతూ ప్రియతమ నేత భాస్కర్ రావు ఘన విజయం సాధించాలని పుణ్యక్షేత్రాలు వెళ్లి వారి గెలుపు కొరకు పూజ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి డైరెక్టర్ నాగార్జున,కట్ల సైదయ్య,ఎడ్ల అంజయ్య, పెనుబల్లి రవి,ఉద్ది ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.









