విధేయత చాటడమే నమాజ్ … !
విధేయత చాటడమే నమాజ్ … !
మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ముస్లింలు ఆచరించాల్సిన ఐదు ప్రాథమిక నియమాల్లో నమాజ్ అతి ముఖ్యమైనది . పవిత్ర ఖురాన్లు 40 సార్లకు పైగా అల్లా దీని ప్రాధాన్యాన్ని తెలిపి తప్పనిసరిగా ఆచరించాల్సిందిగా సూచించారు. విశేష రంజాన్ మాసంలో ఆవిర్భవించిన ఖురాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ జీవితాలు గడి పేందుకు విధేయత చాటడానోకే అల్లా నమాజ్ ను నిర్ధేశించారు.
ప్రతిరోజు ఐదు సార్లు :
దైనందిన కార్యక్రమాలకు అనుగుణంగా ప్రతిరోజు విభిన్న సమయాల్లో నమాజ్లు నిర్ధేశితమయ్యాయి. (1) ఫజర్ (2) జోహార్ (3) అసర్ (4) మగరిబ్ (5) ఇషా గా విభజించారు.
70 రేట్లు పవిత్ర రంజాన్ మాసంలో చదివే ప్రతి నమాజ్ కు 70 రేట్ల అధిక పుణ్యఫలం లభిస్తుంది. అందుకే అత్యధికులు మసీదులకు తరలీవస్తారు.
తరావీ…
రాత్రి ఇషా నమాజ్ తర్వాత ” తరావీ ” నమాజ్ లో ఖురాన్ ను పఠిస్తారు. ఇందులో 30 పార ( విభాగాలు ) లను 27 రోజుల్లో పూర్తి చేస్తారు. ప్రత్యేక తరావీ నమాజ్ లో 20 రకాత్ లు ఆచరిస్తారు.
ఆరోగ్య సూత్రం :
ఆరోగ్యపరంగా కూడా నమాజ్ ను నేటి ఆధునిక యోగాతో సమానంగా వైద్య నిపుణులు వివరిస్తారు. రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం స్నాన పానాదులు ముగించి శుభ్రమైన శరీరంతో నమాజ్ లు చేయడం ఎంతో మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.దైవ సూక్తులు వినడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు నిత్యం సూర్యోదయ మొదలు పెట్టే ఫజార్ నమాజ్ కు ఎనలేని ప్రాధాన్యం ఉంది.
By :
JALEEL RUSTUM
Kangti sangareddy









