Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

మిర్యాలగూడ : ప్రతిరోజు 10 లారీల ధాన్యం దిగుమతి చేసుకోవాలి

మిర్యాలగూడ : ప్రతిరోజు 10 లారీల ధాన్యం దిగుమతి చేసుకోవాలి

రైస్ మిల్లర్లను ఆదేశించిన డిఎస్ఓ

మిర్యాలగూడ, మన సాక్షి:

ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీ, మండలంలోని తుంగపాడు గౌరు నారాయణ రైస్ మిల్లులను ఆయన సందర్శించి ధాన్యం దిగుమతి పై ఆరా తీశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైస్ మిల్లు తప్పనిసరిగా 10 లారీలకు తగ్గకుండా ప్రతిరోజు ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. కెపాసిటీని బట్టి రైస్ మిల్లులు ధాన్యం దిగుమతిని పెంచాలని కోరారు. త్వరితగతిన ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడు వరకు 1.2 లక్షల మెటిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు.

దాన్యం దిగుమతిలో అలసత్యo వహించవద్దన్నారు. ఆయన వెంట సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణారెడ్డి, రైస్ మిల్లర్ రంగా రంజిత్, ఆర్ఐ సురేందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు