Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర

కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిలో సిపిఐ ప్రజా చైతన్య జిబి జాతను మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లి అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ప్రారంభించారు..

 

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజెపి మతోన్మాదాన్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని సమగ్ర అభివృద్ధికై ప్రజా చైతన్య యాత్రను కృష్ణాజిల్లాలో తెలంగాణ వాట తేల్చాలని రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ చేపడుతున్న ప్రచారంలో ఆందోళన భాగంగా మంగళవారం మిర్యాలగూడలో నిర్వహిస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలలో 4000 మంది అమరులయి, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక ప్రజా పోరాటాలు చేసి దున్నేవానికే భూమి కావాలని 10 లక్షల ఎకరాల పంచిన ఘన చరిత్ర సిపిఐ పార్టీ అని అన్నారు.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విధానాల వల్ల జరుగుతున్న అన్యాయాలను దేశ సమైక్యత సమగ్రత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలను విద్వాంసానికి పాల్పడుతూ దేశ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తెలంగాణపై వివక్షతో వివరిస్తున్నది నేటికీ కృష్ణా జలాలను పంపిణీ తీవ్రమైన అన్యాయం జాక్యం జరుగుతూ వస్తుందని అన్నారు.

 

కృష్ణ నది జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయలేదు తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 70 శాతం ఉన్న మనకు దక్కని నీళ్లు కేవలం 37% 299 టీఎంసీలు మాత్రమే 30 శాతం నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న సీమాంధ ప్రాంతంలో దక్కని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నీళ్లు 63% సీమాంధ్ర తెలంగాణ వాడుకున్నవి 37% మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీలను రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని కోరారు. ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టికల్ అవకతవకలను సరిచేసి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

ధరణిలో సమస్యలు పరిష్కారం కొరకు తహసిల్దారులకు బాధ్యత ఇవ్వాలని నువ్వులైన పేదలందరికీ రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్లు దళితులందరికీ దళిత బంధు వర్తింపజేయాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.నిరుద్యోగ యువతీ యువకులకు బృత్ కింద జిల్లాలోని పోడు భూములకు సాగుదారులకు తక్షణమే సాగు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.

 

ఆ రింగ్ రోడ్డు ను శెట్టిపాలెం మీదుగా యాద్గారిపెళ్లి అక్కడి నుండి అవంతిపురం అక్కడి నుండి ఆటోనగర్ లో కలపాలి అక్కడి నుండి అద్దంకి రోడ్డులో కలపాలి సిపిఐ పార్టీ డిమా డుచేస్తున్నది ఆటోనగర ఉన్న డంపింగ్ యార్డును వేరే ప్రదేశానికి తరలించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేశారు. చేస్తుంది దీని వలన చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు విషవాయి బర్నర్ బారిన పడే పరి ప్రమాదం ఉన్నదనిన్నారు.

 

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య, దామరచర్ల వేములపల్లి మండల కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్, జిల్లా యాదగిరి గువ్వల అంజయ్య, దేవరకొండ చంద్రమౌళి వలపట్ల ఎంకన్న, రామలింగం, గువ్వల వెంకటయ్య, మహిళా సమైక్య నాయకురాలు దాసర్ల దుర్గమ్మ, ఎస్కే షమీం, బంటు రాజేశ్వరి, ఎర్రబోతు పద్మ, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు