మిర్యాలగూడ : క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు , 9 మంది అరెస్టు
మిర్యాలగూడ : క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు , 9 మంది అరెస్టు
నల్గొండ (మిర్యాలగూడ) , మనసాక్షి:
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసిన ట్లు నల్గొండజిల్లా యస్.పి కె.అపూర్వ రావు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన వారి నుంచి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు (30 లక్షల విలువ ) ,14 సెల్ ఫోన్స్ (3 లక్షలు విలువ), మొత్తం1 కోటి 45 లక్షల రూపాయల విలువ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ దిలో మయూరినగర్ హౌసింగ్ బోర్డులోని ఫ్లాట్ నెం.303 సాయిదత్త అపార్ట్మెంట్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ప్రకారం మిర్యాలగూడ I టౌన్ సి.ఐ రాఘవేందర్ SI శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది , స్పెషల్ టీమ్ యస్.ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ యస్.ఐ వెంకటేశ్వర్లు, హాలియా పి.యస్ కానిస్టేబుల్ కొమ్ము రవి, రహిమాన్ సంయుక్తంగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఆన్లైన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న మొత్తం 9 మంది వ్యక్తులను..
బంటు రాజేష్ , కోల సాయి కుమార్ , రాచబంతి జీవన్ కుమార్ , నోట్ల సత్యనారాయణ , శాకమూరి ఉదయ్ కుమార్ , బంటు సంతోష్ , గంధం నవీన్ కుమార్ , బంటు వంశీ కృష్ణ, కొండవేటి రాజేష్ అరెస్టు చేశారు.
ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో కీలక వ్యక్తి ఏ 1 అయిన బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తాడు. ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుక్కీ ప్యానల్ నుండి మెయిన్ లైన్ యాక్సెస్‌ని తీసుకున్నాడు, ఈ లింకును తన బామ్మర్ది అయిన కోలా సాయికుమార్ ఫార్వర్డ్ చేసి ఇట్టి యాప్ ద్వారా మొబైల్ ఫోన్స్ కు కనెక్ట్ చేసి ఆన్ లైన్ లో చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా పైన తెల్పిన వ్యక్తుల సహాయముతో ఈ నెట్ వర్క్ లో జాయిన్ చేసుకొని, ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులువుగా డబ్బు సంపాదిస్తారు.
అదే విదముగా ఈ రోజు రాజేశ్ ఇంట్లో,కోలా సాయికుమార్, రాచకొండ జీవన్ కుమార్,నోట్ల సత్యనారాయణ, శాకమూరి ఉదయ్ కుమార్, బంటు సంతోష్, గందం నవీన్ కుమార్, బంటు వంశీకృష్ణ, కొండవీటి రాజేష్ లు హౌసింగ్ బోర్డ్ లోని సాయి దత్త అపార్ట్మెంట్, మయూరి నగర్, నందు ఆన్ లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుచుండగా, పట్టుబడిచేసి కేసు నమోదు రిమాండ్ కి పంపనైనది.
గతంలో ఏ1 రాజేష్ కుమార్ పైన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా హైద్రాబాద్ లోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది.
ఈ కేసును చాకచక్యంగా డియస్పీ వెంకటగిరి పర్యవేక్షణలో మిర్యాలగూడ 1 టౌన్ సి.ఐ రాఘవేందర్, యస్.ఐ శివ తేజ, యస్.ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ యస్.ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గఫార్, కానిస్టేబుల్స్ కొమ్ము రవి హాలియా పి.యస్ , రహిమాన్, జి. హుస్సేన్, బి. వీరబాబు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు ను జిల్లా యస్.పి అఅబినందించారు.









