మంచిర్యాల : తరుగు పేరుతో మోసం.. జాతీయ రహదారిపై రాస్తారోకో..!
తరుగు పేరుతో మోసం.. జాతీయ రహదారిపై రాస్తారోకో..!
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న మోసాలను కొనుగోలులో జాప్యన్ని నిరసిస్తూ పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారొఖో చేపట్టిన అన్నదాతలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేస్తామని కొబ్బరికాయలు కొట్టి, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటికే పదిహేను రోజులు దాటిన కుడా అనేక చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని, ప్రారంభించిన చాలా చోట్ల రసీదులు రైతులకు ఇవ్వకపోగ క్వింటాలుకు ఐదు కిలోలు తరుగు పేర కోత విధించి దోపిడీకి పాల్పడుతున్నారని అని అన్నారు.
ఓ వైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే మరోవైపు ఈ దోపిడీతో రైతును నిలువునా ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసి తరుగు లేకుండా తూకం వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి సత్తయ్య, వడ్డేపల్లి రాజలింగయ్య, బోప్పు సతీష్, హరి గోపాల్, మడిపల్లి స్వామి, పెద్దన్న, ధర్మన్న, నల్లపు రవి, తదితరులు పాల్గొన్నారు.









