Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
రామకృష్ణాపూర్, మన సాక్షి
రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఏప్రిల్ 23, 24 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఐకాన్ అవార్డు టూకే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్, మందమరి ప్రాంతాల నుండి యోగా కరాటే ప్రదర్శనలో లాస్య, సమీక్ష, శ్రీ అక్షయ, శ్రీ నికిత, సాకేత్ నందన్, ప్రియదర్శిని, శ్రీ నందన, హర్షిత లు వీరి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది.
కీర్తి ఆర్డ్స్ అకాడమీ కళాకారులకు గురువు గీతా దేవికి అంబేద్కర్ ఐకాన్ అవార్డు బహూకరించడం జరిగింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో కలను ప్రదర్శించినందుకు, కళాకారులను ప్రోత్సహించినందుకు ఆర్డీవో వివేకానంద రెడ్డి వారి గురువు గీతాదేవిని, వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.









