Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : పేద ప్రజల కోసం ఆఖరి రూపాయి కూడా ఖర్చు పెడతా – బి ఎల్ ఆర్

పేద ప్రజల కోసం ఆఖరి రూపాయి కూడా ఖర్చు పెడతా – బి ఎల్ ఆర్

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ఆదివారం నాటికి19వ రోజు కు చేరుకున్నది. గోగువారి గూడెం నుండి ప్రారంభించి ఐలాపురం, కుంట కింది తండా, కొరియా తండా మీదుగా మైసమ్మ కుంట తండా, సీడ్ ఫార్మ్ తండా, ట్యాంక్ తండా, బాగ్యా తండా ,రాఘవరపు తండా, గోపసముద్రం తండాకు చేరుకున్నది.

 

.ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ గిరిజన తండా లలో ప్రజల స్థితిగతులు అధ్వానంగా ఉండడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య పాలనే కారణం అని అన్నారు. పెరిగిన జనాభా ప్రకారం.. గిరిజనులకు 10% రిజర్వేషన్లు, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గిరిజన బంధు, చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు అందించావాలని డిమాండ్ చేశారు.

గిరిజన ఆడబిడ్డలతో, నాకు జన్మ జన్మల అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది . అందుకే వారిని మా ఇంటి ఆడబిడ్డలా గౌరవిస్తాను అని అన్నారు.గత దశాబ్ద కాలంగా సమాజ సేవ చేస్తున్న బిఎల్ఆర్ బ్రదర్స్, రాజకీయాల లో నిస్వార్ధంగా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం తమ సంపాదనలో ఆఖరి రూపాయి వరకు ఖర్చు చేయడానికి సిద్ధం అని అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ను బెదిరింపులకు గురి చేస్తే, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యం తో కృషిచేసి మిర్యాలగూడ లో కాంగ్రెస్ జెండాను ఎగరేద్దాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గాయం ఉపెందర్ రెడ్డి, అర్జున్,వెంకటేశ్ వర్లు, అనిల్,ఎంపీటీసీ ధర్మ నాయక్, శంకర్ రెడ్డీ, సూర్య నాయక్, వెంకన్న నాయక్, కోటి యాదవ్, హరి బాబూ, బలరాం నాయక్, శ్రీను నాయక్, మహేష్ నాయక్, రాజాలు, భాస్కర్, హుసేన్, హర్యా నాయక్, బాలూ, రావి, బాలాజీ, చిరంజీవి, రమేష్,రాజా, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు…

మరిన్ని వార్తలు