ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి – జూలకంటి రంగారెడ్డి
ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి – జూలకంటి రంగారెడ్డి
అడవిదేవులపల్లి : మన సాక్షి
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి
మండలంలోని కొత్త నందికొండ ఐకెపి సెంటర్ ను సందర్శించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఐకెపి సెంటర్లలో ధాన్యం కొనుగోలు కాక రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రైతాంగ ఇబ్బందులు తొలగించాలని అలా తొలగించాలంటే ఐకెపి సెంటర్ లలో నిల్వ ఉన్నటువంటి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐకెపి కేంద్రాలలో గత నెల రోజుల నుండి రైతులు ధాన్యాన్ని తీసుకొని వచ్చి ధాన్యం అమ్మకం కాక వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన ఎప్పుడు వర్షం వస్తుందో ఎక్కడ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఆగమైతుందోనని రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారని, ఆందోళనలు ప్రభుత్వం చెవికి అధికారుల దృష్టికి రావడం లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ఎంత పంట వేశారు ఎంత పంట ఐకేపీ కేంద్రాలకు వస్తుందని ముందస్తు ప్రణాళిక ప్రభుత్వ యంత్రాంగానికి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొన్ని ఐకెపి సెంటర్లలో ధాన్యం లోడ్ ఎత్తాలంటే రైతుల వద్ద నుంచి అదనంగా డబ్బులు అడుగుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయని అవి రాకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐకెపి కేంద్రాలకు వచ్చినటువంటి దాన్యం కప్పి ఉంచడానికి టార్పాట్లు కూడా రైతులు అందించలేని దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటిరెడ్డి, అడవిదేవులపల్లి మండల కార్యదర్శి జటంగి సైదులు,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హనుమంతు నాయక్,ముని,స్వామి,సర్వయ్య,శివ,రైతులు తదితరులు పాల్గొన్నారు









