మిర్యాలగూడ : ఆధికారులు రోజూ తనిఖీలే.. అయినా ఆ మిల్లుల్లో జీరో దిగుమతి..! జిల్లా కలెక్టర్ సీరియస్
మిర్యాలగూడ : ఆధికారులు రోజూ తనిఖీలే.. అయినా ఆ మిల్లుల్లో జీరో దిగుమతి..! జిల్లా కలెక్టర్ సీరియస్
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులను ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్, వెంకటాద్రిపాలెం ఐ.కె.పి కేంద్రాన్ని సందర్శించి కొనుగోలుపై ఆరా తీశారు.
సరోజ, వెంకటేశ్వర, వెంకటరమణ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఇప్పటివరకు జీరో దిగుమతి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎంఆర్ కేటాయించిన రైస్ మిల్లులు అన్ని తప్పనిసరిగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు జీరో దిగుమతి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి చేయడం మిల్లర్లు దిగుమతి చేసుకోవడంలో రైతులకు ఇబ్బందులు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ ఉండడం వల్ల అకాల వర్షాలకు తడిసి మొలకెత్తి నష్టపోయే అవకాశం ఉందని అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీరియల్ ప్రకారం ఏ రోజుకు ఆరోజు ధాన్యం ఎగుమతి చేయాలని, దానికి అవసరమైన లారీలను అలాట్ చేయాలని ఆదేశించారు.
లారీల కాంట్రాక్టర్లతో మాట్లాడి లారీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ఉన్నత అధికారుల సూచన మేరకు ప్రతిరోజు ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలను వేగవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు ఎం వి ఐ శ్రీనివాస్ రెడ్డి తాసిల్దార్ అనిల్ కుమార్ సివిల్ సప్లై డిటి రామకృష్ణారెడ్డి, ఆర్ ఐ సురేందర్ సింగ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










