Bullet : బుల్లెట్ బండెక్కి ఎంఎల్ఏ, చైర్మెన్
బుల్లెట్ బండెక్కి ఎంఎల్ఏ, చైర్మెన్
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆవిష్కరించారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో కార్మిక సంఘాలు ,నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో బుల్లెట్ బండెక్కి ఎంఎల్ఏ భాస్కరరావు, చైర్మెన్ తిరు నగరు భార్గవ్ పాల్గొని ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ కార్మికులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడని అన్నారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకోవడంతోపాటు పారిశుద్ధ్య కార్మికులకు కూడా వేతనాల పెంపు చేశాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరు నగరు భార్గవ్ , వైస్ చైర్మన్ కుర్ర విష్ణు కౌన్సిలర్లు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.









