అద్భుతం : హైదరాబాదులో నీడ కనిపించదు.. అది ఏ రోజంటే..?
అద్భుతం : హైదరాబాదులో నీడ కనిపించదు.. అది ఏ రోజంటే..?
మనసాక్షి డెస్క్ :
మధ్యాహ్నం వేళలో సూర్యుడు ప్రతాపం ఉంటుంది. ఆ సమయంలో సూర్యుని వెలుతురుకు నీడ కనిపించదంటే ఆశ్చర్యంతో పాటు అద్భుతంగా ఉంటుంది.అయితే ఇలాంటి సంఘటన ఇటీవలనే బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక హైదరాబాదులో కూడా అలాంటి అద్భుతమైన సంఘటన రాబోతుంది. ఆ జీరో షాడో డే.. ఎప్పుడంటే తెలుసుకుందాం.
ఏప్రిల్ 25వ తేదీన బెంగళూరులో జీరో జీరో షాడో డే ఆవిష్కృతమైంది. అంటే సూర్యుడి వెలుగు దేని మీద పడినా నీడ వస్తుంది. కానీ బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 :17 గంటలకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ క్యాంపస్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా జీరో షాడో ఏర్పడింది. 60 నుంచి 120 సెకండ్ల పాటు ఆరోజు ఆ నీడ కనపడలేదు.
సుమారు మూడు నిమిషాల పాటు నీడ భూమిపై కనిపించకపోవడాన్ని బెంగళూరు వాసులు ఆస్వాదించారు. అయితే ఈ అసాధారణమైన సంఘటన రాబోయే రోజుల్లో హైదరాబాదీలు కూడా చూడ కలగనున్నారు. ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 12 : 12 గంటలకు ఈ అరుదైన జీరో షాడో డే ఆవిష్కృతం కానున్నది.
సాధారణంగా కర్కటరాశి మరియు మకరరాశి మధ్య ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉత్తరాయణం.. దక్షణాయం రెండింటిలోనూ సూర్యుని క్షీణత అక్కడి అక్షాంశానికి సమానంగా ఉంటుంది. ఆ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నిట్టనిలుగా పడతాయి. అందువల్ల నిలువుగా ఉండే ఏదైనా వస్తువు లేదా జీవులు నీడను ఏర్పరచలేవు.
ఈ ఘటన ఏడాదిలో రెండుసార్లు సంభవిస్తుంది. ఏప్రిల్ 25న బెంగళూరులో ఈ అద్భుతం కనిపించగా ఈనెల 9వ తేదీన హైదరాబాదులో కనువిందు చేయనున్నది. గత గతంలో 2021లో ఒడిశా భువనేశ్వర్ లో కూడా ఈ అద్భుతం చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.









