Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
NALGONDA : సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న
సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న
చింతపల్లి, మన సాక్షి
రోహిణి కార్తిలో పంటలు వేసినట్లయితే పంట దిగుబడి రావడంతో పాటు రైతుకు అన్ని విధాలుగా లాభదాయకం చేకూరుతుందని సంకల్పంతో ఇటీవల కురిసిన మోతాదు వర్షంతో నల్గొండ జిల్లా రైతన్న తమ పంట పొలాలను ముందుగానే దుక్కులు సాగకు సన్నద్ధం చేస్తున్నారు.
గతంలో వేసిన పంట పొలాలను వేసవిలో దుక్కులు దున్ని జూన్ మాసంలో మరో పంట కోసం నేటి నుండే పొలాలలో ఎరువులు చీమ్మి సాగుకు చదును చేస్తున్నారు. పంటలు వేసేందుకు మరో నెల రోజులు గడువు ఉన్నప్పటికీ ముందుగా కురుస్తున్న వర్షం తో రైతులు ట్రాక్టర్లు లేదా పశువు అరకలు ( నా గళ్ళు ) తో తమ వ్యవసాయ భూమిని రైతులు సాగు సన్నద్ధం చేసుకుంటున్నారు.
రోహిణి లేదా మృగశిర కార్తెలో వేసిన పంటలు రైతుకు లాభదాయకంగా ఉంటాయని వ్యవసాయ రైతులు పేర్కొంటున్నారు.









