Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

మిర్యాలగూడ : ధాన్యం దిగుమతిలో మిల్లర్లు పేచీ పెడితే చర్యలు

మిర్యాలగూడ : ధాన్యం దిగుమతిలో మిల్లర్లు పేచీ పెడితే చర్యలు

మిల్లర్లు, కాంటాక్ట్ లు, అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం

మిర్యాలగూడ, మన సాక్షి:

జిల్లా అధికారులు చేసిన అలాట్మెంట్ ప్రకారమే రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. గురువారం మిర్యాలగూడ ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు తో కలిసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డిఓ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

అంతకు ముందు సాగర్ రోడ్ లోని శ్రీవల్లి రైస్ కార్పొరేషన్ ను సందర్శించారు. మిర్యాలగూడ మండలంలోని బాదలాపురం, మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం వద్ద ఉన్న గోదాములను సందర్శించి దిగుమతి పై ఆరా తీశారు.  లారీ అసోసియేషన్ వద్దకు వెళ్లి లారీల అలాట్మెంట్ పై వివరాలు తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో దాన్యం నాణ్యత పై వ్యవసాయ శాఖ ఏఈవోలు పరిశీలించి సర్టిఫైడ్ చేస్తారని దాని ఆధారంగా వెంటనే కాంటాలు వేసి ఎగుమతికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఈ ఓ లు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ విషయంపై మిల్లర్లు పేచి పెడితే చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా అధికారులు కేటాయించిన ప్రకారం ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు అలాట్మెంట్ చేశారని దాని ఆధారంగా తప్పనిసరిగా ఆ మేరకు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. కొన్ని మిల్లులు జీరో దిగుమతి ఉందని అలా ఉండకూడదు అని సూచించారు. ప్రతి రైస్ మిల్లు తమకు కేటాయించిన ప్రకారం ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిందేనని చెప్పారు.

 

లారీ అసోసియేషన్ వద్దకు కొందరు రైతులు వెళ్లి డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి లారీలను తెప్పించుకుంటున్నారని అలా చేయకూడదని సూచించారు . లారీ కాంట్రాక్టర్లు సకాలంలో కొనుగోలు కేంద్రాలకు లారీలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద డబ్బులు తీసుకున్నట్లయితే డ్రైవర్ల పై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎగుమతి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని అదేవిధంగా మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఇందులో అలసత్వం వహించవద్దని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సివిల్ సప్లై, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీసులు సమన్వయంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనిల్ కుమార్, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, సివిల్ సప్లై డిటి సురేందర్ సింగ్, రూరల్ ఎస్సై రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు