Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

జూనియర్ సివిల్ జడ్జిగా మహతి వైష్ణవి 

జూనియర్ సివిల్ జడ్జిగా మహతి వైష్ణవి 

చౌటుప్పల్. మన సాక్షి :

చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా మహాతీ వైష్ణవి నూతనంగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం బార్ అసోసియేషన్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో నూతన జడ్జిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు.

 

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి నరసింహ మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా చౌటుప్పల్ కోర్టులో శాశ్వత జడ్జి లేకపోవడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. శుక్రవారం నుంచి నూతన జూనియర్ సివిల్ జడ్జిగా మహతి వైష్ణవి బాధ్యతలు స్వీకరించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

 

అదేవిధంగా బార్ అసోసియేషన్ నుండి సంపూర్ణ సహాయ సహకారాలు వారికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాల రమేష్, క్రీడా సాంస్కృతిక అధ్యక్షులు బొమ్మ శశిధర్, కార్యనిర్వహణ సభ్యులు ఏ రంగారెడ్డి, సీనియర్ న్యాయవాది గూడూరు మల్లారెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు