Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

కోదాడ : చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి

చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి

కోదాడ, మనసాక్షి :

మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత హస్తకళా,వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళా సంస్కృతి చేనేత వస్త్ర ప్రదర్శన హస్తకళ మేళాను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత  హస్త కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆ కలను అంతరించిపోకుండా చేనేతకు చేయూతను అందించి ప్రోత్సహించాల్సిన  బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం నిర్వాహకులు లక్ష్మణ్, కార్తీక్ లు మాట్లాడుతూ..

 

నేటి నుండి ఈ నెల 17వ తారీకు వరకు అమ్మకము మరియు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కోట మధు, షేక్ మదర్, ఖాజా మోహిను ద్దీన్, శ్రావణ్,డాక్టర్ బ్రహ్మం, గంధం పాండు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు