Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

10th Result : రేపు పదవ తరగతి పరీక్ష ఫలితాలు

10th Result : రేపు పదవ తరగతి పరీక్ష ఫలితాలు

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు రేపు (బుధవారం) విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు.

 

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా తెలంగాణలో కూడా పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

 

పదవ తరగతి పరీక్షలు మాత్రం ఏప్రిల్ మూడో తేదీన ప్రారంభం కాగా 12వ తేదీన పూర్తయ్యాయి. నాలుగు లక్షల 84 వేల 384 విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు పేపర్, హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచనం కలిగించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలు యధావిధిగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు