Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంవిద్యసూర్యాపేట జిల్లా

గ్రంథాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి స్వీయ అనుభవాలు వెల్లడి

గ్రంథాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి స్వీయ అనుభవాలు వెల్లడి

సొంత ఖర్చులతో ఏర్పాటుకు మంత్రి జగదీష్ రెడ్డి హామీ

సూర్యాపేట , మనసాక్షి:

పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంధాలయానికి వచ్చే విద్యార్థి, యువత కు స్నాక్స్ తో పాటు సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.  ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

 

పోటీ పరీక్షలకు సన్నద్దమౌతున్న యువతీ యువకులతో ఆయన మాట-మంతి సాగించారు.1980 నుండి 1985 వరకుగ్రంధాలయం లోని స్వీయ అనుభవాలు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడిస్తుంటే వారు శ్రద్ధగా ఆలకించారు.వేసవి తాపం నుండి రక్షణగా ఉండేలా కూలర్లు తదితర ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

 

ఆధునిక పరజ్ఞానంతో కూడిన గ్రంధాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వయం ఉపాధి పై మహిళలు దృష్టి సారించాలని ఆయన పిుపునిచ్చారు.అందుకు అవసమైన ఓరియంటేశన్ శిక్షణకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్య ఉపాధి కోసమని, ఉద్యోగం కోసం కాకూడదని ఆయన విద్యార్థి యువతకు హితవు పలికారు.

 

ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడాలని..అదే సమయంలో ప్రబుత్వ ఉద్యగమే పరమావధి కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి వారికి ఉద్బోధించారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయం చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , కాంట్రాక్టర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు