Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

చివ్వేంల ధాన్యం కొనుగోలు కేంద్రం పై విచారణ జరపాలి

చివ్వేంల ధాన్యం కొనుగోలు కేంద్రం పై విచారణ జరపాలి

సూర్యాపేట, మనసాక్షి

చివ్వెంల మండల కేంద్రంలోని పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రంనకు రైతులు తెచ్చిన ధాన్యం లో తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి ఆరోపించారు.

 

గురువారం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఆయన మాట్లాడుతూ పిఎసిఎస్ చైర్మన్ గా చలామణి అవుతున్న మారునేని సుధీర్ రావు ను రైతులు తమ ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన అక్రమ దందా గురించి అడుగుతున్న క్రమంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రైతులను మిమ్ములను ధాన్యము ఇక్కడ ఎవడు పోయమన్నాడ

 

అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని జరిగిన అవకతవకల మీద విచారణ చేయకుండా పిఎసిఎస్ సిబ్బందిని వెనకేసుకొస్తున్నాడని అన్నారు. రైతులకు న్యాయం చేయమంటే ఈ విధంగా మాట్లాడుతూ సస్పెండ్ కు గురైన ఉద్యోగిని సెంటర్లలో తిప్పుతూ రైతుల ధాన్యంలో అక్రమాలకు పాల్పడుతూ అధికార పార్టీ అండదండలతో వచ్చిన ధనముతో చలామణి అవుతున్నారని అన్నారు.

 

దీనిపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు.చివ్వేంల దాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకొవాలని మరల ఇలాంటి సమస్యలు పుణారవృతం కాకుండా చూడాలని కోరారు.

మరిన్ని వార్తలు