Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!

RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!

సూర్యాపేట , మనసాక్షి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు యొక్క విధివిధానాలు సంస్థ రక్షణ -కార్మికుల హక్కుల పరిరక్షణ ద్యేయంగా ఉండాలని మెరుగైన వేతనాలు, వసతులు, సర్వీస్ కండిషన్స్ ప్రభుత్వం కల్పించాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు.

 

సూర్యపేట డిపోలో ఆర్టీసీ కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ప్రతిపాదనలు “అనే రాష్ట్ర కమీటీ ముద్రించిన బుక్ లెట్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఆర్టీసీకార్మికుల విలీన బిల్లు ఆమోదం పొందిన వెంటనే తమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపసంఘ కమీటీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి అక్కడి కార్మికుల స్థితిగతులు మరియు విలీనం వల్ల పొందిన సదుపాయాలు, కోల్పోయిన హక్కులు తదితర విషయాలపై అధ్యయనం చేసి అన్ని విషయాలను క్రోడీకరించి మెమోరాండాలు ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆర్టీసీ అధికారులకు అందించామన్నారు.

 

విలీనం అనంతరం ఆంధ్రప్రదేశ్ కార్మికులకు ఆర్టీసీ వైద్య సదుపాయం కోల్పోవడం,ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ సౌకర్యం కల్పించలేదన్నారు.కార్మికులకు ఉన్న వివిధ రకాల సదుపాయాలు రద్దు చేయపడిందన్నారు.అప్పీల్స్ రద్దు ఉద్యోగ భద్రతా ఊసేలేకుండాపోయిందన్నారు. 2019 ఆర్టీసీ సమ్మె లోని విలీన డిమాండ్ పై నేడు ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం పట్ల కార్మికులు స్వాగతిస్తున్న 2017,2021 వేతన సవరణ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక పోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

 

ALSO READ : 

  1. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
  2. Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
  3. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  4. Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!

 

2013 వేతన బకాయిలు సీసీఎస్, పి ప్ తదితర బకాయిలను వేంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బకాయిలు చెల్లించకుండా విలీనం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్ట పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం స్పందించి విలీనానికి ముందే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రబుత్వం వేసిన కమీటీ లో కార్మిక సంఘాలకు చోటు కల్పించి ఆంధ్రప్రదేశ్ లో కార్మికులకు జరిగిన నష్టాలను ఇక్కడ జరగకుండా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

 

మొత్తం 80 పైగా అంశాలతో కూడిన సంక్షిప్తసమాచారం తో బుక్ లెట్ ముద్రించామని అధికారులు, కార్మికులు అధ్యయనం చేసి తమ అభిప్రాయాలను, సూచనలు తెలపాలని కార్మికులను కోరారు.
అనంతరం డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్ ) డిపో కార్మికులకు బుక్ లెట్ లు అందిచా మన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి బైరు శ్రీకంట్లం, ప్రచార కార్యదర్శి పర్శ రాములు, మల్లయ్య, భాస్కర్, వీరయ్య, యాదగిరి, మున్నీరు, వెంకన్న, సైదులు, ఉమాదేవి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు