Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!
Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!
వరుస చోరీల దొంగ అరెస్ట్
మేళ్లచెరువు,మనసాక్షి:
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మేళ్లచెరువు పిఎస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెద్దగొన్నూరుకు చెందిన గుబిలి సుబ్రమణ్యం పదిహేనేళ్లుగా దొంగతనాలు, జూదానికి అలవాటు పడ్డాడు.
ఎపిలోని పలు జిల్లాల్లో 45 చోరీల్లో జైలు శిక్ష అనుభవించాడు. మళ్లీ ఈ నెల 26 న సూర్యాపేట జిల్లా కోదాడలో బెల్లంకొండ రఘు ఇంట్లో ఎవరూ లేని సమయంలో 9 లక్షల 50 వేల నగదు చోరీ చేశాడు. ఈ నెల 31 న కోదాడలోని ఎల్ ఐసి కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో సుబ్రమణ్యం ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
MOST READ :
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
- SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?
- Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
- Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
ఏడున్నర లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు,మరో రెండు లక్షలను అతను జూదంలో ఖర్చు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.కేసు ఛేధనలో చాకచక్యంగా వ్యవహరించిన కోదాడ టౌన్ ఎస్సై రాము, రామాంజనేయులు,యాదవేంద్ర రెడ్డి ని ఎస్పీ అభినందించారు. అంతకు ముందు మేళ్లచెరువు లో మైహోం ప్రజాభిప్రాయ సేకరణను కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించారు.









