Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజాతీయం

Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

మనసాక్షి : వెబ్ డెస్క్ :

రెండు గంటలలో 61 వేల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలో కొద్దిరోజులుగా అసాధారణ పరిస్థితిలో నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కాగా పిడుగుపాటుకు ఎంతోమంది మృతి చెందుతున్నారు.

రెండు గంటల వ్యవధిలోనే 61 వేల తెలుగు పిడుగులు పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అతలాకుతలమయ్యారు. పిడుగులు పడి బీభత్సం సృష్టిస్తున్నాయి.

ALSO READ : 

1. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!

2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

3. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!

శనివారం రెండు గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పిడుగులు పడినట్లు అధికారులు తెలిపారు. పిడుగుల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో నలుగురు, బలంగీర్ జిల్లాలో ఇద్దరు, అంగుల్, బాధ్, డెంకానల్, గజపతి, జగత్ సింగ్ పూర్, పూరరలో ఒకరి చొప్పున 12 మంది మరణించారు.

గజపతి కండమల్ జిల్లాల్లో పిడుగులపాటుకు 8 పశువులు చనిపోయాయి. పిడుగుల కారణంగా మృతి చెందిన వారికి ఒడిశా ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు బీభత్సంగా ఉంటాయని మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ALSO READ :

1. GO 46 : జీవో 46 ను రద్దు పర్చాలి.. రూరల్ కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్..!

2. ISRO : నేడు సూర్యుడు పై అధ్యయనానికి ఇస్రో ప్రయోగం.. ఆదిత్య L-1 ప్రయోగం..!

3. Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారవచ్చు అని పేర్కొన్నది. దీని వల్ల ఒడిశా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని ఆ ప్రభుత్వం అధికారులు సూచనలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు