Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!

Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!

హైదరాబాద్ , మన సాక్షి :

టీఎస్పీఎస్సీ నిర్వహించే ఇంటర్ సాంకేతిక విద్యాశాఖలో భర్తీ కోసం నిర్వహించనున్న ఫిజికల్ డైరెక్టర్ నియామాక పరీక్ష వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు టిఎస్పిఎస్సి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పరీక్షను తిరిగి నవంబర్ 14వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష ఉంటాయని తెలియజేసింది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

ALSO READ : 

  1. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
  2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  3. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  5. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!

అదే విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ల నియామకానికి నిర్వహించనున్న ఆన్ లైన్ పరీక్షల హాల్ టికెట్లను టిఎస్పిఎస్సి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈనెల 12వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సిబిటి (CBT) విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు వారం రోజుల ముందు నుంచే హాల్ టికెట్లు ఉంటాయని పేర్కొన్నది. సుమారు 1392 పోస్టుల గాను ఈ నియామాక పరీక్ష జరుగుతుంది. 11 రోజులపాటు 16 సబ్జెక్టులలో రెండు సెషన్ల చొప్పున ఆయా తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థి రెండు మూడు సబ్జెక్టులకు దరఖాస్తులు చేసినా.. సబ్జెక్టు వారీగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

MOST READ : 

  1. Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
  2. Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!
  3. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!

మరిన్ని వార్తలు