Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!

సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట పట్టణంలో ని జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందగా ఆమె భర్త కు తీవ్ర గాయాలు అయ్యాయి. పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ జలగం. కవిత మంగళవారం పాఠశాల కు ఉదయం బైక్ పై వెళుతున్నారు.

సూర్యాపేటలోని కొత్త మార్కెట్ కు వెళ్లే దారిలో జాతీయ రహదారిపై జంక్షన్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయిరాలు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గిరిచేసింది. అర్బయీన్ సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఇవాళ ఉదయం అకస్మాత్తుగా ఆలస్యంగా ఐచ్చిక సెలవు రద్దయినట్టుగా సమాచారం ఇచ్చి ఉపాధ్యాయులందరినీ విధులకు హాజరు కావలసిందిగా ఆదేశించారు.

ఆలస్యంగా సమాచారం అందుకున్న లింగయ్య , కవిత ఉపాధ్యాయ దంపతులు హడావుడిగా పాఠశాలకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురైనారు. కవిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లింగయ్య తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ :

  1. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
  2. Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
  3. పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి..!
  4. సూర్యాపేట : సద్దుల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
  5. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

మరిన్ని వార్తలు