BREAKING : పాతపట్నం లో ఉద్రిక్తత
BREAKING : పాతపట్నం లో ఉద్రిక్తత
పాతపట్నం, మనసాక్షి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో టిడిపి నేతలు నిరసన దీక్ష కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ , ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు టిడిపి నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు.
ALSO READ :
1. మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
2. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
3. Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు నిరసన కార్యక్రమాన్ని విరమించాలని పోలీసులు చెప్పినప్పటికీ. టిడిపి నాయకులు ,కార్యకర్తలు వినకపోవడంతో చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
పోలీసులకి టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదంతో తోపులాటకు చోటుచేసుకుంది. టిడిపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనను తెలియజేశారు. దీంతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ తో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.









