Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

BalaiahBabu : చంద్రబాబు అరెస్ట్ తో రంగంలోకి దిగిన బాలయ్య..!

BalaiahBabu : చంద్రబాబు అరెస్ట్ తో రంగంలోకి దిగిన బాలయ్య..!

మంగళగిరి, మన సాక్షి :

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో బాలయ్య బాబు రంగంలోకి దిగారు. ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంగళవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై ఆయన మాట్లాడారు. చంద్రబాబును కావాలనే కక్షతోనే అరెస్టు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి స్కాం క్రియేట్ చేశారని ఆరోపించారు.

ALSO READ : 

1. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!

2. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!

3. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!

4. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నేను వస్తున్నా . నేనే ముందుంటా.. తెలుగు వాడి పౌరుషం ఏంటో చూపిస్తాం.. జనం సైనికులై తిరగబడాల్సిన సమయం వచ్చిందని బాలకృష్ణ పేర్కొన్నారు.

జగన్ పై ఎన్నో కేసులు ఉన్నాయని ఇప్పుడు గాలి కబుర్లు చెబుతున్నారని అన్నారు. మార్పు కోసం ప్రజలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని, బాబును ఎలాగైనా జైలుకు పంపాలనే కక్షతో చేస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కీం గుజరాత్ లోనే మొదలైందని, ఆ స్కీమ్ తో ఎంతో మంది విద్యార్థులు ఉపాధి పొందినట్లు ఆయన తెలిపారు. టిడిపి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలపై దాడులతో జగన్ ప్రభుత్వం భయపెడుతుందన్నారు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు.

ALSO READ : 

  1. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  3. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
  4. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!

మరిన్ని వార్తలు