వేములపల్లి : యూరియా ఎక్కువ ధరలకు అమ్మితే షాపులు సీజ్, లైసెన్సు రద్దు.. పిఎసిఎస్, ఫర్టిలైజర్ షాప్స్ ఆకస్మిక తనిఖీ..!
వేములపల్లి : యూరియా ఎక్కువ ధరలకు అమ్మితే షాపులు సీజ్, లైసెన్సు రద్దు.. పిఎసిఎస్, ఫర్టిలైజర్ షాప్స్ ఆకస్మిక తనిఖీ..!
ఆకస్మిక తనిఖీ చేసిన ఏడి నాగమణి
వేములపల్లి , మన సాక్షి:
వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార ఆగ్రో రైతు కేంద్రాలు , ఫర్టిలైజర్ షాపులను వ్యవసాయ శాఖ అధికారి ఏడి నాగమణి ఆకస్మికంగా తనిఖీ చేశారు .
అనంతరం ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార ఆగ్రో రైతు కేంద్రాలలో రైతులకు కావలసిన యూరియా సరిపడ ఉన్నది, కావున ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ALSO READ :
- Health check : మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు.. నల్గొండ జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
- Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
మండల పరిధిలోని గల ఫర్టిలైజర్ షాపు యాజమాన్యులు రైతులకు యూరియా ను ఎంఆర్పి ధరలకే అందజేయాలని సూచించారు. యూరియాను ఎక్కువ ధరలకు అమ్మితే షాపులు సీజ్ చేసి లైసెన్సు ను రద్దు చేయడం జరుగుతుంది కఠిన చర్యలు తప్పవని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏవో ఋశేంద్రమణి, ఏ ఈ ఓ లు నితిన్ నాయక్ ,సంతోష్, మాల్సురు, సీఈఓ రవీందర్ రావు, సైదులు, తదితరులు పాల్గొన్నారు.









