పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో రైతులకు మోసం చేస్తున్నారు
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో రైతులకు మోసం చేస్తున్నారు
రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగూరావూ నామాజీ
నారాయణపేట టౌన్, మనసాక్షి :
పాలమూరు – రంగారెడ్డి పథకం పేరుతో కేసీఆర్ నారాయణపేట జిల్లా రైతులను మోసం చేస్తున్నాడని రాష్ట్ర బీ.జె.పి. క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ ఆరోపించారు.
మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో బీ.జె.పి. జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్ తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9 సంవస్తారాలైనా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని అని చెప్పరు.
ALSO READ :
- వేములపల్లి : యూరియా ఎక్కువ ధరలకు అమ్మితే షాపులు సీజ్, లైసెన్సు రద్దు.. పిఎసిఎస్, ఫర్టిలైజర్ షాప్స్ ఆకస్మిక తనిఖీ..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
- BalaiahBabu : చంద్రబాబు అరెస్ట్ తో రంగంలోకి దిగిన బాలయ్య..!
ప్రాజెక్టు పనులు పూర్తి కాక ముందే ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా చివరి ఆయకట్టు చివరన ఉన్నదని సాగు నీరు ఎల్లప్పుడు వస్తుందని చెప్పారు. ఇంకా కాలువల పని పూర్తికానీదే నీళ్లు ఎలా వస్తాయని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను గుంతల పాలమూరు గా మార్చేశారని ఆరోపించారు.
బీ.అర్.ఎస్.ప్రభుత్వం జిల్లా ప్రజలను మోసం చేస్తోందని చెప్పరు. జీఓ నెం 69 నారాయణపేట – కొడంగల్ ఎత్తి పొతల పథకం ద్వార నారాయణపేట జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. ఈ సమావేశంలో బీ.జె.పి. ఓ.బీ.సి. మోర్చా జిల్లా అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, నియోజక కన్వీనర్ నర్సిములు, పట్టణ అధ్యక్షుడు రఘు రామయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









