కొనసాగుతున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల దీక్షలు
కొనసాగుతున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల దీక్షలు
శాశ్వత ఉద్యోగులు గా గుర్తించాలి
నారాయణపేట టౌన్, మన సాక్షి:
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ ఉద్యోగులుగగుర్తించాలని, మీ నిమం టైం స్కెల్ ఇవ్వాలని చేస్తున్న దీక్షలు బుధవారం 9వ రోజుకు చేరింది. నారాయణపేట మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్లో దీక్షలు చేస్తున్నారు.
నేటి దీక్ష శిబిరానికి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి , విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మనోహర్ ప్రసాద్ గౌడ్, సంతోష్ బీజేపీ రిటైర్డ్ ఉద్యోగ సంఘ అధ్యక్షులు వెంకటయ్య లు తమ సంపూర్ణ మద్దతు ను తెలిపారు.
ALSO READ : Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఇందులో పనిచేస్తున్నారు ఇందులో పనిచేసే కొందరు ఇతర ఉద్యోగాలకు వయసు కూడా లేదు ఇటువంటి వారిని విద్యా శాఖలో విలీనం చేసి వారికి మినిమం టైం స్కెల్ అందించాలని వారు కోరారు.
ఈ దీక్షలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది నేటి కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి , జిల్లా జేఏసీ అధ్యక్షులు ఎల్లా గౌడ్, ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ హుస్సేన్ నాయకులు, పి.రాజు, రాజశేఖర్ గౌడ్, శశికాంత్, రెడ్డి, సురేష్ , మధు , కరిష్మా, వనిత , రాజేశ్వరి, నవీన్ , రవికుమార్ మిగతా సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.









