Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలురాజకీయం

మిర్యాలగూడ : రఘువీర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

మిర్యాలగూడ : రఘువీర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

మిర్యాలగూడ, మనసాక్షి:

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాజీవ్ చౌక్ వద్ద మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పూజించడం వలన నిమజ్జనం సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు కలుషితమవుతాయని చెప్పారు. అలాంటి విగ్రహాలు పర్యావరణకు ముప్పు అన్నారు.

ALSO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి విగ్రహాలను వాడాలని కోరారు. మట్టి గణపతులను నీళ్లలో నిమజ్జనం చేస్తే కరిగిపోతాయని దాని వలన ఎలాంటి హాని జరగదని చెప్పారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతి ని పుజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

నియోజవర్గ వ్యాప్తంగా 25 వేలు మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం, పొదిల వెంకన్న, మెరుగు శ్రీనివాస్, చాంద్ పాషా, ఎండి ఇమ్రాన్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డీ నర్సిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బీరవోలు హరి ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

మరిన్ని వార్తలు