Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

మిర్యాలగూడ : ఘనంగా వినాయక చవితి

మిర్యాలగూడ : ఘనంగా వినాయక చవితి

కోదండ రామాలయంలో బి ఎల్ ఆర్ పూజలు

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న కోదండ రామాలయంలో వినాయక విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ మనం చేసుకునే ఈ వినాయక చవితి పండుగ పర్యావరణాన్ని కాపాడుకునేలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతి పూజించాలని వాటిని నీటిలో నిమజ్జనం చేస్తే మట్టిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ప్రజలకు అదేవిధంగా పంట పైరులకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉంటాయని అ అన్నారు.

అదే విధంగా మనం స్వామివారికి వాడే ఇరవై ఒక్క రకాల పత్రి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని నిమజ్జనం రోజు మనం ఆకులను నీటిలో కలపడం వలన వాటిలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి మనం ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. అదే విధంగా గణపతి ఊరేగింపు సమయంలో సామరస్యంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా గొడవలు పడకుండా గణపతి ఉత్సవాలను రంగ రంగ వైభవంగా నిర్వహించుకోవాలని యువకులను కోరుకుంటున్నానని వారన్నారు.

ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ నవరాత్రులు ఎంతో నిష్టతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరూ కెమికల్ కల్పినటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని అన్నారు. మనమందరము ఈ పర్యావరణాన్ని కాపాడటంలో ముందుండాలని వారు అన్నారు .

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి మన హిందూ పండుగలలో చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ వినాయక చవితి పండుగ స్వాతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ గ్రామ గ్రామాలలో వినాయక పందిర్లు వేయించి అక్కడ గ్రామ ప్రజలను సమీకరించి పండుగ విశిష్టతను, అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అందరికీ తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యం చేశారన్నారు.

అదే ఆనవాయితీగా ఇప్పటివరకు మన హిందువులు ఈ వినాయక చవితి పండుగలు రోజురోజుకీ వాడవాడలా పెరుగుతున్నాయని ప్రజలలో భక్తి భావం పెరుగుతుందని ఇది సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి గణపతులనే పూజించి నిమజ్జనం చేయాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేస్ఫూర్తితో మనం ముందుకు పోవాలని వారన్నారు.

ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

ఈ కార్యక్రమంలో పట్టణ గణేష్ కమిటీ ఉత్సవ అధ్యక్షుడు రేపాల పురుషోత్తం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు గార్లపాటి పండిత్ రెడ్డి, బండారు నరసింహ, పుట్ట దయాకర్ రెడ్డి, బొజ్జ మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి , మందడి కిషోర్ రెడ్డి , రంగా, పసుపులేటి రాజు, నామిరెడ్డి రమేష్ రెడ్డి, మోహన్ రామిరెడ్డి, బొగ్గారపు యాదగిరి, సాదు గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు