BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!
BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ శనివారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 11వ తేదీన జరిగిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో తెలంగాణ హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు.
హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థుల వాదన. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్ఎస్ యూ ఐ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రెండుసార్లు రద్దు అయ్యాయి.
హైకోర్టు తీర్పుపై టీఎస్పీఎస్సీ అప్పీల్ కు వెళ్ళనున్నట్లు తెలిసింది. ఆర్డర్ కాపీని వెంటనే ఇవ్వాలని టిఎస్పిఎస్సి లాయర్లు కోరారు. సోమవారం అప్పీలు దాఖలు చేసే అవకాశం ఉంది.
ALSO READ :









