Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ఏళ్లు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..!

ఏళ్లు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..!

అనంతగిరి , మన సాక్షి:

గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

ఏళ్లు గడుస్తున్నాయి తప్ప పాలకుల్లో మాత్రం స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గోల్ తండా, వసంతపురం, తెల్లబండ తండా, మీట్య తండా, తోపాటు వివిధ గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదని వాహనదారులు ఆవేద వ్యక్తం చేశారు.

ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!

నిత్యం ఏదో పని నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు ఈ రోడ్డు కుండానే కోదాడకు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పూర్తిగా గుంతల మయంగా మారడంతో నడుము నొప్పితో పాటు వాహనాలు సైతం త్వరగా చెడిపోతున్నాయని ప్రైవేట్ వాహనాల యజమానులు ద్విచక్ర వాహనదారులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ఆయ గ్రామ ప్రజలు కోరారు.

ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!

మరిన్ని వార్తలు