Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి..!

గొర్ల పంపిణీ వేగవంతం చేయాలి..!

సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా 3000 పైగా డీడీలు కట్టిన వారికి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్ల పంపిణీ వేగవంతం నగదు బదిలీ ద్వారా పంపిణీ చేయాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కురుమల ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈరోజు తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఎం వి ఎన్ భవనంలో కడెం లింగయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉడత రవీందర్ మాట్లాడుతూ గొల్ల కురుమల అభివృద్ధి కోసం గొర్ల పంపిణీ స్కీము ప్రవేశపెట్టి రెండో విడత గొర్ల పంపిణీ కోసం గొల్ల కురుమలు అప్పులు తెచ్చి డీడీలు కట్టి సంవత్సరాలు దాటుతున్న తెచ్చిన వాటికి అప్పులు పెరుగుతున్నాయి తప్ప నేటికీ గొర్ల పంపిణీ చేయలేదని ఉడుత రవీందర్ తీవ్రస్థాయిలో ప్రభుత్వ పై మండిపడ్డారు.

ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!

జిల్లాలో 7735 మందికి గొర్ల పంపిణీ జరగాలి కానీ గ్రామము లో 10 నుండి 15 మందిని మాత్రమే ఎంపిక చేసి పంపిస్తున్నారని దీంట్లో కూడా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని గ్రామాలలో ఎంపిక చేసిన క్రమసంఖ్య ప్రకారం పంపకుండా తన ఇష్టం వచ్చినవారికి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే ఎమ్మెల్యేల ఇండ్లు ముందు ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.

దీనివల్ల గొల్ల కురుమల మధ్య అల్లర్లకు కారణమవుతున్నారని వెంటనే గొర్ల పంపినిలో ఎమ్మెల్యే జోక్యం ఉండకూడదని. గొర్లు మేకల మీద కోసం డిమాండ్. గొర్ల మేకల పెంపకం దారుల గ్రామీణ సొసైటీలకు ఎన్నికలు జరగకుండా అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని. అన్నారు వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలఒకేసారి ఎన్నికలు జరపాలని.

ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!

డిమాండ్ చేశారు గొర్రెలు మేకల మేత కోసం ప్రభుత్వ భూములు చెరువులు చెరువు శిఖలలో ఉన్న తుమ్మ చెట్లను కేటాయిస్తూ 1016 599 జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, మాట్లాడుతూ గొర్రెలు మేకలకు సంవత్సరానికి మూడుసార్లు వేయవలసిన నటల మందులు నేటికీ గొర్లకు మేకలకు వేయకపోవడం చాలా దురదృష్టకరమని. తగినన్ని వైద్యశాలలు లేవని ఖాళీగా ఉన్న పశు వైద్య పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కడెం లింగయ్య, వీరబోయిన రవి, జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కంచుగొట్ల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు గుండాల లింగయ్య,ఉప్పుల రమేష్, పిల్లి వీర మలయ్య ,గుండాల పుల్లయ్య, జటంగి లింగయ్య, గోపనబోయిన రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

  1. Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
  2. Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు